Studio18 News - ANDHRA PRADESH / Tirupati : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. తన భార్య నారా భువనేశ్వరితో కలిసి ఆయన ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం దంపతులకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వీరు అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకున్నారు. అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు అమ్మవారి విశ్వరూప దర్శనం ఏడాదికి ఒకసారి మాత్రమే ఉంటుంది. దీంతో, అమ్మవారి విశ్వరూప దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వచ్చారు.
Admin
Studio18 News