Saturday, 24 January 2026 03:06:24 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Nadendla Manohar: ఏపీలో ఈ నెల 3 నుంచి ధాన్యం కొనుగోళ్లు... 48 గంటల్లోనే రైతులకు డబ్బులు: మంత్రి నాదెండ్ల

Date : 01 November 2025 07:57 PM Views : 238

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : నవంబరు 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు వాట్సాప్ సందేశంతో సులభంగా రైతుల రిజిస్ట్రేషన్ ఈ ఖరీఫ్ సీజన్‌లో 51 లక్షల టన్నుల సేకరణ లక్ష్యం ధాన్యం కొన్న 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు రాష్ట్రవ్యాప్తంగా 5 వేలకు పైగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు తాడేపల్లిగూడెంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్న మంత్రి నాదెండ్ల రాష్ట్రంలోని రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2025–26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను నవంబరు 3వ తేదీన ప్రారంభించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. ధాన్యం విక్రయించాలనుకునే రైతులు సులభంగా తమ పేర్లను నమోదు చేసుకునేందుకు ఈసారి వాట్సాప్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి తెలిపారు. రైతులు తమ ఫోన్ నుంచి 7337359375 అనే వాట్సాప్ నంబర్‌కు “HI” అని సందేశం పంపడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని సూచించారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో ప్రభుత్వం 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నాదెండ్ల మనోహర్ వివరించారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 3,013 రైతు సేవా కేంద్రాలు, 2,061 ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేశామని చెప్పారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో సుమారు 10,700 మంది సిబ్బంది పాల్గొంటారని, రైతుల నుంచి ధాన్యం సేకరించిన 24 నుంచి 48 గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు జమ అయ్యేలా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు. "నాణ్యమైన గోనె సంచులు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. తేమ శాతాన్ని నిర్ధారించే యంత్రాలు, రవాణా సౌకర్యాల విషయంలో సమస్యలు రాకుండా చూడాలి" అని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. నవంబర్ 3వ తేదీ సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని ఆరుగొలను గ్రామంలో మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారికంగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :