Sunday, 08 March 2026 04:37:21 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Nara Lokesh: కోయంబత్తూరు పర్యటనపై మంత్రి నారా లోకేశ్ స్పందన

Date : 08 September 2025 06:56 PM Views : 192

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : కోయంబత్తూరు పారిశ్రామికవేత్తలతో సమావేశమైన మంత్రి నారా లోకేశ్ ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించిన లోకేశ్ పరిశ్రమలకు సింగిల్ విండో అనుమతులు, స్నేహపూర్వక విధానాలు సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ లాజిస్టిక్ హబ్‌గా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ వ్యాపారవేత్తలకు పిలుపు ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ కోయంబత్తూరు పర్యటనపై సోషల్ మీడియాలో స్పందించారు. కోయంబత్తూరు విమానాశ్రయంలో తనకు తమిళనాడు బీజేపీ నేత అమర్ ప్రసాద్ రెడ్డి, స్థానిక తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారని, వారి ఆత్మీయత ఎంతో ఆనందాన్ని కలిగించిందని లోకేశ్ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. "కోయంబత్తూరులోని పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూలతలను వివరించాను. ప్రస్తుతం ఏపీలో పరిశ్రమలకు సింగిల్ విండో అనుమతులతో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను అమలు చేస్తున్నాం. పరిశ్రమదారులు డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టుతో రాష్ట్రానికి వచ్చాక నిర్మాణం పూర్తయ్యే వరకు పూర్తి బాధ్యత మాదే. రాష్ట్రంలో పెద్దఎత్తున వాయు, జల, రోడ్డు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రపదేశ్ లాజిస్టిక్ హబ్ గా అభివృద్ధి చెందుతోంది. రాష్ట్రంలో అమలు చేస్తున్న పరిశ్రమ అనుకూల విధానాల వల్ల జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. పరిశ్రమలకు గమ్యస్థానంగా మారిన ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా పిలుపునిచ్చాను" అని లోకేశ్ వివరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :