Studio18 News - ANDHRA PRADESH / : గుంటూరు జిల్లా కలెక్టరేట్ లో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర@2047 సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ, అమరావతి నిర్మాణం, సేవ, ఉపాధిపై సమీక్ష నిర్వహించామని... స్వర్ణాంధ్ర@2047 ప్రణాళిక కోసం సూచనలు తీసుకున్నామని వెల్లడించారు. యువతకు ఉపాధిపై సమగ్ర ప్రణాళికను అధికారులు సిద్ధం చేశారని చెప్పారు. చేనేత, పర్యాటక కేంద్రంగా గుంటూరు జిల్లా అభివృద్ధికి అధికారులు సూచనలు చేశారని... నేతన్నలకు మరింత గుర్తింపు వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తామని మంత్రి నాదెండ్ల తెలిపారు.
Admin
Studio18 News