Thursday, 12 March 2026 01:10:40 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Tirumala Parakamani Case: పరకామణి చోరీ కేసులో కీలక పరిణామం... హైకోర్టుకు నివేదిక సమర్పించిన సిట్

Date : 02 December 2025 07:25 PM Views : 270

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : సీల్డ్ కవర్‌లో నివేదికను సమర్పించిన సిట్ బృందం లోక్ అదాలత్‌లో కేసు పరిష్కారంపై హైకోర్టు ఆదేశాలతో విచారణ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిని ప్రశ్నించిన సిట్ శుక్రవారం కేసుపై తదుపరి విచారణ జరపనున్న హైకోర్టు తిరుమల శ్రీవారి ఆలయం పరకామణిలో జరిగిన చోరీ కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ఈ కేసుపై విచారణ జరిపిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తన నివేదికను సమర్పించింది. సిట్ బృందానికి నేతృత్వం వహించిన సీఐడీ అదనపు డీజీ రవిశంకర్ అయ్యనార్, ఈ నివేదికను సీల్డ్ కవర్‌లో న్యాయస్థానానికి అందజేశారు. ఈ కేసుపై తదుపరి విచారణను హైకోర్టు శుక్రవారం చేపట్టనుంది. 2023 ఏప్రిల్‌లో తిరుమల పరకామణిలో టీటీడీ ఉద్యోగి రవికుమార్ 920 డాలర్లు దొంగిలిస్తూ పట్టుబడ్డాడు. ఈ ఘటనపై తిరుమల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే, అనూహ్యంగా ఈ కేసును లోక్ అదాలత్‌కు బదిలీ చేశారు. నిందితుడు రవికుమార్ తనకు చెందిన రూ.40 కోట్ల విలువైన ఏడు ఆస్తులను టీటీడీకి విరాళంగా ఇవ్వడంతో, 2023 సెప్టెంబర్‌లో కేసును రాజీ ఫార్ములాతో మూసివేశారు. అయితే, చిన్న దొంగతనం కేసుకు ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు విరాళంగా ఇచ్చి కేసును మూసివేయించడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై మాచర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లోక్ అదాలత్‌లో కేసును పరిష్కరించడాన్ని సవాలు చేస్తూ, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని కోరారు. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, కేసుపై దర్యాప్తు చేయాలని ఆదేశించడంతో సిట్ విచారణ ప్రారంభించింది. ఈ విచారణలో భాగంగా సిట్ అధికారులు.. కేసు నమోదైనప్పుడు టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న బి. కరుణాకర్ రెడ్డి, లోక్ అదాలత్‌లో పరిష్కారం జరిగినప్పుడు టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డిని, మాజీ ఈవో ధర్మారెడ్డితో పాటు పలువురు టీటీడీ, పోలీసు అధికారులను ప్రశ్నించి వారి వాంగ్మూలాలను నమోదు చేశారు. ఇప్పుడు సిట్ సమర్పించిన నివేదిక ఆధారంగా హైకోర్టు తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :