Thursday, 12 March 2026 01:26:04 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Sunil Yadav: కడప ఎస్పీని కలిసిన వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్

2019లో వివేకా హత్య ఏ2గా ఉన్న సునీల్ యాదవ్ గతేడాది బెయిల్ పై విడుదల తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కడప ఎస్పీకి విన్నపం

Date : 20 March 2025 12:02 PM Views : 338

Studio18 News - ANDHRA PRADESH / : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ నేడు కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ను కలిశాడు. తనకు ప్రాణహాని ఉందని, తనకు భద్రత కల్పించాలని అర్థించాడు. వివేకా హత్య కేసులో ఇతర నిందితులు తనను జైల్లో బెదిరించారని వెల్లడించాడు. బెయిల్ పై బయటికి వచ్చిన తర్వాత కూడా బెదిరింపులు వస్తున్నాయని పేర్కొన్నాడు. తాను మాట్లాడే విషయాలు కొందరికి నచ్చడం లేదని సునీల్ యాదవ్ తెలిపాడు. వైసీపీ పెద్దల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. కాగా, 'హత్య' అనే సినిమాలో తనను, తన తల్లిని ఎంతో క్రూరంగా చిత్రీకరించారని సునీల్ యాదవ్ వాపోయాడు. ఆ సినిమాను నిలిపివేయాలని కూడా ఎస్పీని కోరాడు. వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ ఏ2గా ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది అక్టోబరులో అతడికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :