Sunday, 08 March 2026 04:48:44 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల... విషెస్ చెప్పిన మంత్రి నారా లోకేశ్

Date : 20 May 2025 05:36 PM Views : 216

Studio18 News - ANDHRA PRADESH / : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఐసెట్-2025) ఫలితాలు గురువారం వెలువడ్డాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/ICET/ ద్వారా తెలుసుకోవచ్చు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి పర్యవేక్షణలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈ పరీక్షల నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. మే 7వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 93 కేంద్రాల్లో, హైదరాబాద్‌లోని ఒక కేంద్రంతో కలిపి మొత్తం 94 కేంద్రాల్లో రెండు సెషన్లలో ఈ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఐసెట్ పరీక్షకు మొత్తం 37,572 మంది దరఖాస్తు చేసుకోగా, 34,131 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 32,719 మంది అర్హత సాధించారు. అంటే, ఉత్తీర్ణతా శాతం 95.86%గా నమోదైంది. మీ ఉజ్వల భవిష్యత్తుకు నా శుభాకాంక్షలు: నారా లోకేశ్ ఈ సందర్భంగా రాష్ట్ర విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ విద్యార్థులకు అభినందనలు తెలిపారు. "ఏపీ ఐసెట్ లో అర్హత సాధించిన విద్యార్థులందరికీ అభినందనలు. ఫలితాలు ఇప్పుడు https://cets.apsche.ap.gov.in/ICET , వాట్సాప్ గవర్నెన్స్ నెం. 9552300009 లో అందుబాటులో ఉన్నాయి. మీ ఉజ్వల విద్యా భవిష్యత్తుకు నా శుభాకాంక్షలు" అని పేర్కొన్నారు. ఐసెట్-2025 టాపర్ల వివరాలు ఇలా ఉన్నాయి... మేకా మనోజ్ 197.91 మార్కులతో మొదటి ర్యాంకు కైవసం చేసుకోగా, డి. సందీప్ రెడ్డి 179.51 మార్కులతో రెండో ర్యాంకు, ఎస్. కృష్ణ సాయి 178.51 మార్కులతో మూడో ర్యాంకు సాధించారు. అలాగే, వల్లూరి సాయిరామ్ సాత్విక్ 175.69 మార్కులతో నాలుగో ర్యాంకు, రావూరి మాధుర్య 175.45 మార్కులతో ఐదో ర్యాంకును దక్కించుకున్నారు. కాగా, మే 10వ తేదీన ప్రాథమిక ‘కీ’ ని విడుదల చేసి, మే 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరించారు. వచ్చిన అభ్యంతరాలను నిపుణుల బృందం పరిశీలించి, తుది ‘కీ’ ని రూపొందించింది. ఈ తుది ‘కీ’ ఆధారంగానే ఫలితాలను వెల్లడించారు. అర్హత సాధించిన విద్యార్థులు తమ ర్యాంకు కార్డులను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. తదుపరి అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి త్వరలో విడుదల చేయనుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :