Studio18 News - ANDHRA PRADESH / Tirupati : తిరుమల : తిరుమలలో ( Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 8 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం ( Sarvadarsan ) అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 69,214 మంది భక్తులు దర్శించుకోగా 26,599 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.27 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు. శ్రీవారి మెట్టు మార్గంలో మరింత మెరుగైన సౌకర్యాలు తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు శ్రీవారి మెట్టు మార్గంలో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని టీటీడీ ఈవో జె. శ్యామలరావు తెలిపారు. కాలినడకన వెళ్లే మార్గంలో టోకెన్లు పొందేందుకు భక్తులు అసౌకర్యానికి గురవుతున్నట్లు తెలియడంతో టీటీడీ అదనపు సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వి. వీరబ్రహ్మంతో కలిసి ఆయన తనిఖీలు చేపట్టారు. భక్తులు ఆటోవాలాల నుంచి ఇబ్బందులు పడుతున్నారని, సరైన సహకారం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. భక్తులకు శాశ్వత పరిష్కార మార్గం దిశగా చర్యలు తీసుకుంటామని ఈవో తెలిపారు.
Admin
Studio18 News