Sunday, 08 March 2026 10:29:08 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Annamayya District Police Transfers: అన్నమయ్య జిల్లాలో 364 మంది పోలీసు సిబ్బంది బదిలీ

అరాచక శక్తులకు, ప్రతిపక్ష నేతలకు సహకరిస్తున్న పోలీసులపై చర్యలు సమస్యాత్మక జిల్లాల్లో అక్రమాలపై ప్రభుత్వం ఆరా పోలీసు శాఖలో ప్రక్షాళన చర్యలు వేగవంతం

Date : 22 March 2025 11:24 AM Views : 353

Studio18 News - ANDHRA PRADESH / : పోలీస్ శాఖలో ప్రక్షాళన చర్యలు ప్రారంభమయ్యాయి. మొదట చిత్తూరు జిల్లాలో చేపట్టిన ఈ ప్రక్రియను, తాజాగా అన్నమయ్య జిల్లాలో కొనసాగిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో 264 మంది సిబ్బందిని బదిలీ చేసిన అధికారులు, తాజాగా అన్నమయ్య జిల్లాలో 364 మంది సిబ్బందిని బదిలీ చేశారు. వీరిలో 41 మంది ఏఎస్సైలు, 123 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 200 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. క్షేత్రస్థాయిలో కొందరు పోలీసులు ప్రతిపక్ష నేతలకు సహకరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ బదిలీలు జరిగాయని తెలుస్తోంది. పుంగనూరుకు చెందిన టీడీపీ కార్యకర్త రామకృష్ణ తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని వేడుకున్నా పట్టించుకోకపోవడంతో ఆయన హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్‌గా స్పందించారు. అరాచక శక్తులను ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ గుప్తాను ఆదేశించారు. దీంతో అరాచక శక్తులను అణచివేయడంతో పాటు పోలీస్ శాఖలో ప్రక్షాళన చేపట్టారు. చిత్తూరు జిల్లా నుంచే డీజీపీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అరాచక శక్తులకు, ప్రతిపక్ష నేతలకు సహకరిస్తున్న పోలీసులను బదిలీ చేయించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాబల్యం ఉన్న ఒక పోలీస్ స్టేషన్‌లోని సిబ్బంది మొత్తాన్ని (42 మంది) తొలగించి కొత్త వారిని నియమించారు. అలాగే ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటి సిబ్బందిని గుర్తించి బదిలీ చేసేందుకు అధికారులు జాబితా సిద్ధం చేస్తున్నారు. రాయలసీమ, పల్నాడు, గుంటూరు, విజయవాడ, కృష్ణా వంటి సమస్యాత్మక జిల్లాల్లో గతంలో జరిగిన అక్రమాలపై వివరాలు సేకరిస్తున్నారు. నేరస్తుల వివరాలు, వారిపై ఉన్న కేసులు, భూ కబ్జాలు, బెదిరింపులు, రౌడీషీట్లు, అక్రమ ఆస్తులు, కేసుల దర్యాప్తు స్థితి వంటి వివరాలను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేకరిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :