Sunday, 08 March 2026 10:26:39 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Nara Lokesh: మాజీ సీఎం జగన్ కు మంత్రి లోకేశ్ హితవు

Date : 22 March 2025 11:17 AM Views : 302

Studio18 News - ANDHRA PRADESH / : ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను చెల్లించిందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలకు సంబంధించి నిధులు విడుదల చేశామని ఆయన గుర్తుచేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం 2019లో అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ బకాయిలను చెల్లించలేదని, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అభివృద్ధి పనులను నిలిపి వేశారని లోకేశ్ ఆరోపించారు. సగం పూర్తయిన పనులను ధ్వంసం చేశారని విమర్శించారు. ఇది ఆయన నిరంకుశ మనస్తత్వాన్ని చాటిచెప్పిందని అన్నారు. ప్రభుత్వం మారినా అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగించడం సంప్రదాయమని లోకేశ్ చెప్పారు. విధ్వంస పాలనతో జగన్ ప్రజాస్వామ్య స్ఫూర్తిని బ్రేక్ చేశారని విమర్శించారు. ప్రభుత్వం శాశ్వతమని, రాజకీయాలు ఎన్నికలు పూర్తయ్యేవరకేనని జగన్ ఇప్పటికైనా తెలుసుకోవాలని హితవు పలికారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :