Tuesday, 31 March 2026 04:31:17 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు

Date : 06 December 2025 06:20 PM Views : 234

Studio18 News - ANDHRA PRADESH / Guntur : గుంటూరు నగరంలో పిన్ పాయింట్ గా మెరుగైన పారిశుధ్య పనులు చేపట్టాలని, కేటాయించిన విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే కార్మికులు, కార్యదర్శులు, అధికారులపై కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రజారోగ్య అధికారులకు స్పష్టం చేశారు. శుక్రవారం జేకేసి కాలేజీ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, ఆర్టీసి కాలనీ, బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత బాలాజీ నగర్ లో చెత్త సేకరణపై ప్రజలు ఫిర్యాదు చేయగా ప్రజారోగ్య అధికారులు, కార్యదర్శులతో వివరాలు అడిగి తెలుసుకుకన్నారు. అనంతరం మాట్లాడుతూ నగరంలో పారిశుధ్య పనుల్లో భాగంగా ఇంటింటి చెత్త సేకరణ, డ్రైన్ల శుభ్రంపై ప్రజల నుండి ఫిర్యాదులు అందుతున్నాయని, కార్మికులు పిన్ పాయింట్ గా విధులు నిర్వహించేలా కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లు పర్యవేక్షణ చేయాలన్నారు. బాలాజీ నగర్ లో పారిశుధ్య పనుల్లో 2 రోజుల్లో మెరుగదల ఉండాలని, చెత్త సేకరణ, డ్రైన్ల శుభ్రం చేసే విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే కార్మికులపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎస్ ని ఆదేశించారు. ఆర్టీసి కాలనీ మెయిన్ రోడ్ లో డ్రైన్ ఆక్రమణ చేసి ఏర్పాటు చేసిన దుకాణాలను తొలగించాలని పట్టణ ప్రణాళిక కార్యదర్శులను ఆదేశించారు. రోడ్లపై ఉన్న ఆవులను జిఎంసి గోశాలకు తరలించాలన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ లో ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసిన బహుళ అంతస్తు భవనాన్ని పరిశీలించి, డ్రైనేజిని మేజర్ డ్రైన్ లోకి కనెక్ట్ చేయాలన్నారు. ఇంజినీరింగ్ అధికారులు నూతన రోడ్లను ఎండ్ టు ఎండ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్లు, డ్రైన్ల నిర్మాణ అనంతరం వ్యర్ధాలను సదరు కాంట్రాక్టరే తొలగించాలన్నారు. పర్యటనలో డిఈఈలు రమేష్ బాబు, కళ్యాణరావు, ఆర్ఓ సాదిక్ భాష, ఎస్ఎస్ ఆయూబ్ ఖాన్, ఇంజినీరింగ్, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :