Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Tomato Prices In AP: మార్కెట్ లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. బహిరంగ మార్కెట్ లో టమాటా ధరలు సెంచరీకి దగ్గరలో ఉంది. ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. దీంతో పెరిగిన కూరగాయల ధరలతో వినియోగదారులు బెంబేలెత్తి పోతున్నారు. వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు బజార్లలో తక్కువ ధరకు నాణ్యమైన టమాటాలు విక్రయిస్తోంది. దీంతో కొనుగోలుదారులు రైతు బజార్లలో బారులు తీరారు. ఏపీలోని అన్ని రైతు బజార్లలో కిలో టమాటా రూ.50కే సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు. రైతు బజార్లలో ఆధార్ నంబర్ లేదా ఫోన్ నంబర్ నమోదు చేసుకొని ఒక్కొక్కరికి కిలో టమాటాను అందజేస్తున్నారు.
Admin
Studio18 News