Tuesday, 31 March 2026 04:29:54 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Nara Lokesh: వైసీపీ విష ప్రచారాలను తిప్పికొట్టండి: నారా లోకేశ్

Date : 30 January 2026 07:31 PM Views : 77

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : వైసీపీ చేయకూడని పాపాలు చేసిందన్న లోకేశ్ కూటమిని చీల్చే కుట్ర చేస్తోందని మండిపాటు కూటమిని చీల్చడం ఎవరి వల్ల కాదని వ్యాఖ్య వైసీపీ చేయకూడని పాపాలన్నీ చేసిందని మంత్రి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. వైసీపీ విష ప్రచారాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత టీడీపీ కార్యకర్తలదేనని అన్నారు. కూటమిని చీల్చే కుట్ర కూడా చేస్తున్నారని... కూటమి పార్టీలను విడదీయడం ఎవరి వల్ల కాదని చెప్పారు. వైసీపీ నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా... అందరూ కలిసి ఐక్యంగా ఎదుర్కోవాలని చెప్పారు. టీడీపీ టౌన్, వార్డు, మండల స్థాయి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల కోసం నిర్వహించిన శిక్షణ తరగతుల్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని లోకేశ్ సూచించారు. కూటమి పార్టీల నేతల మధ్య సఖ్యత చాలా ముఖ్యమని అన్నారు. తిరుమల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా గత వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేసి, భక్తుల మనోభావాలను గాయపరిచారని విమర్శించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :