Sunday, 08 February 2026 10:12:32 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

AP Govt: విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారి అకౌంట్‌లలో డబ్బులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల ...

Date : 22 March 2025 10:33 AM Views : 378

Studio18 News - ANDHRA PRADESH / : Reimbursement: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ కు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఫీజు రీయింబర్స్ మెంట్ కు సంబంధించి రూ.600 కోట్లు విడుదల చేసినట్లు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన చేశారు.

2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ కింద ఇప్పటికే రూ.788 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా.. మరో రూ.600 కోట్లు విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి త్వరలోనే మరో రూ.400కోట్లు విడుదల చేయడం జరుగుతుందని శశిధర్ తెలిపారు. దశలవారీగా బకాయిలన్నీ చెల్లిస్తామని విద్యాసంస్థలకు స్పష్టం చేసిన ప్రభుత్వం.. ఫీజులు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి తేవొద్దని, ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని సూచించింది.

పెండింగ్ లో ఉన్న ఫీజురీయింబర్స్ మెంట్ మొత్తాలను విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించిందని ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. అయితే, ఇటీవల ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో.. విద్యార్థులను తరగతులకు హాజరుకాకుండా చేసినా, పరీక్షలకు హాజరు కాకుండా హాల్ టికెట్ల నిలిపివేత లాంటి చర్యలు తీసుకున్నా అట్టి యాజమాన్యాలపై కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. అన్ని విశ్వవిద్యాలయాల వీసీలు తమ పరిధిలో ఉన్న విద్యాసంస్థల్లో ఈ తరహా ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :