Saturday, 17 January 2026 09:18:47 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Bhumana Karunakar Reddy: పవనానందుల గొంతుక ఇప్పుడెందుకు మూగబోయింది?: భూమన

కాశీనాయన క్షేత్రం కూల్చివేతపై వైసీపీ ఆందోళన పవన్, లోకేశ్ ల మధ్య సమన్వయ లోపం ఉందంటూ భూమన విమర్శలు కూల్చివేత వెనుక దుష్టశక్తులు ఎవరో తేల్చాలని డిమాండ్

Date : 17 March 2025 02:28 PM Views : 278

Studio18 News - ANDHRA PRADESH / : రాష్ట్రంలో కాశీనాయన క్షేత్రంలో కూల్చివేతల వెనుక ఉన్న దుష్ట శక్తులను వెలికి తీయాలని వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు సమస్యల్లో కూరుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాశీనాయన క్షేత్రాన్ని కూల్చివేయడం అంటే హిందూ ధర్మం గుండెపై బుల్డోజర్లతో దాడి చేయడమేనని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. అటవీ శాఖ పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో పనిచేస్తుండగా, అటవీశాఖ అధికారులే కాశినాయన క్షేత్రంలో కూల్చివేతలు చేపట్టారని వెల్లడించారు. మరి, సనాతన ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడే పవనానంద స్వామి వారి గొంతుక ఇప్పుడెందుకు మూగబోయిందని భూమన నిలదీశారు. గతంలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై స్పందించిన పవన్, ఇప్పుడు కాశినాయన క్షేత్రం విషయంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పైగా, మంత్రి నారా లోకేశ్ క్షమాపణ చెప్పడం, ఆయనే క్షేత్రాన్ని పునర్ నిర్మిస్తానని చెప్పడం వారి మధ్య వైరుధ్యాలకు నిదర్శనమని భూమన అన్నారు. సోషల్ మీడియాలో వీరి మధ్య ఉన్న విభేదాలు బహిరంగ రహస్యమేనని ఆయన గుర్తు చేశారు. గతంలో ఆలయాలను కూల్చిన వారే ఇప్పుడు కాశీనాయన క్షేత్రంపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. టైగర్ జోన్ పరిధిలో ఉందని దేవాదాయ శాఖ మంత్రి చెప్పడం చూస్తుంటే శ్రీశైలం క్షేత్రాన్ని కూడా కూల్చివేస్తారేమోనని అనుమానం కలుగుతోందని భూమన అన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ క్షేత్రాన్ని అటవీ చట్టాల నుంచి మినహాయించాలని కేంద్రానికి లేఖ రాశారని ఆయన గుర్తు చేశారు. పవన్ కల్యాణ్ ఆదేశాలు లేకుండానే కాశినాయన క్షేత్రంలో కూల్చివేతలు జరిగాయా? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ కూడా ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదని ఆయన నిలదీశారు. కూటమి పాలనలో హిందూ ధర్మానికి గడ్డుకాలం వచ్చిందని, వైసీపీ ప్రభుత్వంపై నిందలు వేయడమే వారికి తెలుసని భూమన విమర్శించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :