Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీలో బడ్జెట్‌పై ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. శాసనసభకు తొలిసారి ఎన్నికైన 84 మంది, రెండోసారి ఎన్నికైన 39 మందికి వివిధ అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడం నుంచి ఆమోదించే వరకూ గల ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్నారు. పార్లమెంటరీ రీసెర్చ్ స్టడీస్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సదస్సు అనంతరం సీఎం అధ్యక్షతన ఎన్‌డీఏ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది.
Also Read : సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత
Admin
Studio18 News