Saturday, 24 January 2026 07:16:40 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

పులివెందులలో టీడీపీ తోరణాల తొలగింపు... బీటెక్ రవి స్పందన

Date : 30 May 2025 03:42 PM Views : 174

Studio18 News - ANDHRA PRADESH / : పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా ఏర్పాటు చేసిన తోరణాలను తొలగించిన ఘటన తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీసింది. ఈ సంఘటనకు సంబంధించి వైసీపీకి చెందిన పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై టీడీపీ పులివెందుల ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పులివెందులలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీటెక్ రవి మాట్లాడుతూ... పులివెందుల రింగురోడ్డు చుట్టూ వైఎస్సార్ విగ్రహాలు ఏర్పాటు చేశారని, అయితే మహానాడు సందర్భంగా తాము ఎక్కడా వైఎస్సార్ విగ్రహాలకు తగిలే విధంగా తోరణాలు కట్టలేదని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ తోరణాలు తొలగించిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీటెక్ రవి వైసీపీ నాయకత్వంపై, ముఖ్యంగా వైఎస్ కుటుంబ సభ్యులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. "నిజమైన వైఎస్సార్ అభిమానులు ఒక్కసారి ఆలోచించాలి. వైఎస్ విజయమ్మపై కేసు నమోదు చేయించిన వారెవరో, వైఎస్ షర్మిలకు న్యాయబద్ధంగా రావాల్సిన ఆస్తిని రాకుండా అడ్డుకుంది ఎవరో ఆలోచించాలి. రాజశేఖర్ రెడ్డి రాముడైతే, లక్ష్మణుడిలా పనిచేసిన వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి. అలాంటి వివేకాను హత్య చేసిన కేసులో అభియోగాలు ఎవరు ఎదుర్కొంటున్నారు?" అని ఆయన నిలదీశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అడ్డం పెట్టుకుని కొందరు రాజకీయాలు చేస్తున్నారని బీటెక్ రవి తీవ్రంగా విమర్శించారు. పది రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తాం అని బీటెక్ రవి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదని... అలా చేసినట్లు నిరూపించగలరా? అని సవాల్ విసిరారు. "పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసింది వైసీపీ నాయకులే. గతంలో కడప నుంచి వస్తున్న నన్ను అరెస్ట్ చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పింది మీరు కాదా?" అని ప్రశ్నించారు. ఎంపీ అవినాశ్ రెడ్డి తన తల్లిని అడ్డుపెట్టుకుని సీబీఐ విచారణ నుంచి తప్పించుకున్నారని కూడా బీటెక్ రవి ఆరోపించారు. ఈ పరిణామాలు పులివెందుల రాజకీయాల్లో మరింత వేడిని రాజేశాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :