Saturday, 07 March 2026 09:11:38 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

Venigandla Ramu: కొడాలి నాని రూ. 500 కోట్ల అవినీతికి పాల్పడ్డారు... తక్షణమే విచారణ జరిపించి, కఠిన చర్యలు తీసుకోవాలి: వెనిగండ్ల రాము

కొడాలి నాని పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం దోచేశారన్న వెనిగండ్ల మంత్రిగా ఉన్నప్పుడు భారీ స్కామ్ చేశారని ఆరోపణ కరోనా సమయంలో కేంద్రం పేదలకు ఇచ్చిన బియ్యం

Date : 07 March 2025 01:21 PM Views : 384

Studio18 News - ANDHRA PRADESH / Guntur : మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పేదలకు అందాల్సిన బియ్యం బొక్కేశారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. రూ. 500 కోట్ల మేర భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తక్షణమే కొడాలి నానిపై విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు ప్రభుత్వాన్ని కోరారు. కొడాలి నాని మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి జేసీ అండతో భారీ స్కామ్ చేశారని వెనిగండ్ల తెలిపారు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందించిన రేషన్ బియ్యం దోచేశారని ఆరోపించారు. గుడివాడలో 40 వేల రేషన్ కార్డులు ఉండగా... కేవలం 12 వేల కార్డులకు మాత్రమే బియ్యం సరఫరా చేసి మిగిలిన బియ్యం దోచేశారని చెప్పారు. కేవలం గుడివాడలోనే ఈ మేరకు అవినీతికి పాల్పడితే... మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ మేరకు అవినీతికి పాల్పడ్డారో అర్థం చేసుకోవచ్చని అన్నారు. కొడాలి నాని అక్రమాలపై లోతుగా దర్యాప్తు చేయాలని కోరారు. ఆయనకు సహకరించిన అధికారులు, రైసు మిల్లర్లపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :