Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా, మంత్రిగా పాలన పరుగులు పెట్టిస్తున్నారు. తన ఆధీనంలో ఉన్న శాఖలపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇటీవలే పల్లె పండుగ అని గ్రామీణాభివృద్ధి పనులు మొదలుపెట్టారు. నిన్న పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లాకు వెళ్లారు. అయితే విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం ముగించుకుని పవన్ కళ్యాణ్ తిరుగు ప్రయాణం అవ్వగా కాన్వాయ్ ఎదురుగా ఓ దివ్యాంగురాలు సమస్యలు చెప్పడానికి ఎదురుచూస్తుందని గమనించి తన కాన్వాయ్ ఆపి దిగారు. దీంతో పవన్ కళ్యాణ్ అక్కడే రోడ్ మీదే కూర్చొని ఆ దివ్యాంగురాలు సమస్యలు విని ఆమె ఇచ్చిన సమస్య పత్రాలు తీసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు తీరుస్తాను అని పవన్ హామీ ఇచ్చారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. డిప్యూటీ సీఎం అయ్యాక కూడా ఏమి మారకుండా అదే సింప్లిసిటీతో ప్రజల దగ్గరకు వెళ్లి వాళ్ళ సమస్యలు వింటున్నారని పవన్ కళ్యాణ్ ని మరోసారి అభినందిస్తున్నారు.
Admin
Studio18 News