Monday, 02 December 2024 04:43:38 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

శ్రీవారి “లడ్డూ కల్తీ” పిటిషన్లపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఫస్ట్ రియాక్షన్.. ఏమన్నారంటే?

Date : 01 October 2024 05:19 PM Views : 24

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : తిరుమల తిరుపతి శ్రీవారి “లడ్డూ కల్తీ” పిటిషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తొలిసారి స్పందించారు. ఇవాళ తిరుమలకు బయలుదేరే ముందు పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. కల్తీ జరిగిందని సుప్రీంకోర్టు చెప్పలేదని అన్నారు. న్యాయస్థానం ముందున్న సమాచారం ఆధారంగా కోర్టు ఆ వ్యాఖ్యలు చేసిందని పవన్ కల్యాణ్ చెప్పారు. కల్తీ తయారీలో వాడిన నెయ్యి గురించి రిపోర్టు వచ్చిన తేదీ విషయంలో మాత్రమే కాస్త తికమక ఉందని తెలిపారు. అసలు ప్రసాదం విషయంలోనే కాకుండా వైసీపీ పాలనలో ఇటువంటి ఉల్లంఘనలు చాలా జరిగాయని అన్నారు. తమ సర్కారు వాటిపై చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. సుమారు 219 దేవాలయాలను అపవిత్రం చేశారని, రామతీర్థంలో శ్రీరాముల వారి విగ్రహాన్ని ధ్వంసం చేశారని పవన్ కల్యాణ్ తెలిపారు. తన దీక్ష సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ముందుకు తీసుకువెళ్లడానికేనని తెలిపారు. తాను ప్రాయశ్చిత్త దీక్షను పూర్తి చేశాక దీనిపై డిక్లరేషన్ చేస్తామని చెప్పారు. వైసీపీ పాలనలో అనేక తప్పిదాలు జరిగాయని అన్నారు. శ్రీవారి లడ్డూ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉందని, దానిపై అంతగా మాట్లాడనని పవన్ చెప్పారు. కాగా, ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్.. తిరుమల చేరుకున్నారు. ఇవాళ అలిపిరి వద్ద శ్రీ వేంకటేశ్వర స్వామి పాదాల చెంతకు చేరుకుని అక్కడ పూజలు నిర్వహిస్తారు. అనంతరం మెట్ల మార్గంలో తిరుమల కొండ ఎక్కనున్నారు. రాత్రి 9 గంటలకు కొండపైకి చేరుకుని రాత్రికి అక్కడే బసచేస్తారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల సమయంలో దీక్షా మాలతోనే స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేస్తారు. అక్కడి నుంచి వెంగమాంబ అన్నదాన సత్రానికి చేరుకుని భక్తులకు అందించే అన్న ప్రసాదాలను పరిశీలిస్తారు. అనంతరం టీటీడీ అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. బుధవారం రాత్రి కూడా కొండపైనే బస చేస్తారు. ఆయన చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష గురువారం పూర్తవుతుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు