Studio18 News - ANDHRA PRADESH / : సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా ఉదారత చాటారు. తన స్వగ్రామంలోని అమ్మవారి ఆలయానికి రాకపోకలు సాగించే భక్తులకు ఇబ్బంది కలగకుండా దారి చూపారు. ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లె పంచాయతీ నారావారిపల్లెలోని నాగాలమ్మ ఆలయంలో గ్రామస్థులు నిత్యం పూజలు చేస్తుంటారు. ఇక ప్రతియేటా సంక్రాంతి సందర్భంగా కుటుంబసమేతంగా స్వగ్రామానికి వెళ్లే చంద్రబాబు కూడా అమ్మవారికి పూజలు చేయడం ఆనవాయతీ. అయితే, ఈ ఆలయానికి వెళ్లేందుకు సరైన దారి లేదని స్థానికులు ఇటీవల సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దాంతో వెంటనే స్పందించిన చంద్రబాబు తానే 90 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ స్థలం గుండా రాకపోకలకు దారిని ఏర్పాటు చేశారు. దాంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబు ఉదారతను కొనియాడుతున్నారు.
Admin
Studio18 News