Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు కాసేపట్లో పునఃప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు పనులను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ... మూడు సంవత్సరాలలో అమరావతి పనులను పూర్తి చేస్తామని చెప్పారు. సీఆర్డీఏ బిల్డింగ్ నిర్మాణం గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తయిందని... మిగిలిన పనులను మూడేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. సీఆర్డీఏ పరిధిలో పెట్టుబడులు పెట్టిన వారికే భూములిచ్చామని చెప్పారు. ఇన్వెస్టర్లకు మౌలికవసతులు అవసరమని... వారికి రోడ్లు, నీరు వంటి అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు.
Admin
Studio18 News