Studio18 News - ANDHRA PRADESH / : వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. అందుబాటులో ఉన్న వైసీపీ లోక్ సభ, రాజ్యసభ ఎంపీలంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. త్వరలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. పోలవరం ఎత్తు తగ్గింపుపై పార్లమెంటులో నిలదీయాలని జగన్ తమకు సూచించారని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయవద్దని పార్లమెంటులో పోరాడతామని చెప్పారు.
Also Read : అల్లు అర్జున్ కు బెస్ట్ విషెస్ తెలిపిన వైసీపీ నేత
Admin
Studio18 News