Studio18 News - ANDHRA PRADESH / Palnadu : పల్నాడు జిల్లా దాచేపల్లి లో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కాపు కమ్యూనిటీ భవనం శంకుస్థాపనలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ దొంగలకు ఊతమిచ్చే పార్టీ వైసీపీ అయితే దొంగలను జైల్లో పెట్టించేది కూటమి ప్రభుత్వం అని అన్నారు. తిరుపతి పరకామణి, లిక్కర్,లక్ష కోట్లు కొట్టేసిన కేసులు మాజీ సీఎం జగన్ దృష్టిలో చాలా చిన్నవట అని వాపోయారు. ప్రజలు తరిమికొట్టేది కూటమి నాయకుల్ని కాదు వైసిపి నాయకులనే అని యరపతినేని తెలిపారు. వైసీపీ నాయకులు చేసిన దురాఘతాలు నేటికీ వెంటాడుతూనే ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం సమాజంలో అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని అన్నారు. కాపు కళ్యాణ మండపం పూర్తి కావడానికి ఎంత ఖర్చైనా భరాయిస్తాం అని యరపతినేని తెలిపారు.
Admin
Studio18 News