Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముంబై బయల్దేరారు. అక్కడాయన రతన్ టాటా పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తారు. చంద్రబాబు అధ్యక్షతన కొద్దిసేపటి క్రితం క్యాబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా రతన్ టాటాకు క్యాబినెట్ సంతాపం ప్రకటించింది. అనంతరం అజెండాను వాయిదా వేసి సమావేశాన్ని ముగించారు. అనంతరం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కలిసి ముంబై బయల్దేరారు. 1.50 గంటలకు వారు ముంబై చేరుకుంటారు. అక్కడి ఎన్సీపీఏ గ్రౌండ్‌లో సందర్శనకు ఉంచిన రతన్ టాటా భౌతిక కాయాన్ని దర్శించి నివాళులు అర్పిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రతన్ టాటా అంతిమయాత్ర ప్రారంభం కానుంది. మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనుంది. కేంద్ర ప్రభుత్వం తరపున హోంమంత్రి అమిత్ షా హాజరవుతారు.
Admin
Studio18 News