Sunday, 08 March 2026 04:01:08 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

AP Police: కోళ్ల దొంగల కోసం వచ్చిన ఏపీ పోలీసులపై గ్రామస్తుల ఆగ్రహం

Date : 15 September 2025 06:56 PM Views : 171

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : కోళ్ల దొంగతనం కేసు విచారణకు భద్రాద్రి జిల్లాకు వచ్చిన ఏపీ పోలీసులు స్థానిక పోలీసులకు చెప్పకుండా దర్యాప్తు చేపట్టారని గ్రామస్తుల ఆరోపణ ఓ మహిళ ఇంట్లోకి బలవంతంగా వెళ్లారని ప్రజల ఆగ్రహం విచారణ పేరుతో ఇబ్బంది పెట్టారని ఆరోపిస్తూ పోలీసుల నిర్బంధం సీసీ కెమెరాలను సైతం తొలగించారని స్థానికుల ఆందోళన ఏలూరు జిల్లా చింతలపూడి పోలీసులను అడ్డుకున్న దమ్మపేట వాసులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఊహించని పరిణామం ఎదురైంది. ఓ కోళ్ల దొంగతనం కేసు విచారణ కోసం వచ్చిన వారిని స్థానిక గ్రామస్తులు అడ్డుకుని నిర్బంధించారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో దమ్మపేట మండల కేంద్రంలో సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళితే, ఏలూరు జిల్లా చింతలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కోళ్ల దొంగతనం కేసుకు సంబంధించి, విచారణ నిమిత్తం ఏపీ పోలీసులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటకు వచ్చారు. అయితే, వారు ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేయకుండానే నేరుగా దర్యాప్తు ప్రారంభించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో, పోలీసులు దమ్మపేటలోని ఓ మహిళ ఇంటికి వెళ్లి, ఎలాంటి అనుమతి లేకుండా లోపలికి ప్రవేశించారని స్థానికులు చెబుతున్నారు. విచారణ పేరుతో ఆమెను ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా, ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలను కూడా తొలగించారని ఆరోపించారు. ఈ విషయం తెలియడంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. మహిళ అని కూడా చూడకుండా వేధించడం, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ పోలీసుల వాహనాన్ని చుట్టుముట్టి, వారిని ముందుకు కదలనీయకుండా నిర్బంధించారు. తమకు న్యాయం చేయాలని, ఏపీ పోలీసుల తీరుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటన రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య సమన్వయ లోపాన్ని, అధికార పరిధికి సంబంధించిన చర్చను మరోసారి తెరపైకి తెచ్చింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :