Studio18 News - ANDHRA PRADESH / : వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టాడంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. టీడీపీ నేతల ఫిర్యాదుతో కాకాణిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో, ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీసులు కాకాణి గోవర్ధన్ రెడ్డిని విచారిస్తున్నారు. కాకాణి ఇవాళ వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. ఆయనను పోలీసులు పలు కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో విమర్శల దాడి తీవ్రమైంది. దాంతో, ప్రభుత్వ పెద్దలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది.
Also Read : లోకనాయకుడు సహా నా పేరుకు ముందు బిరుదులన్నింటినీ తిరస్కరిస్తున్నాను: కమల్ హాసన్
Admin
Studio18 News