Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ విజయవాడ నుంచి శ్రీశైలంకు సీప్లేన్ లో ప్రయాణించారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి సీప్లేన్ డెమో లాంచ్ చేసిన చంద్రబాబు... ఆ సీప్లేన్ లోనే శ్రీశైలం చేరుకున్నారు. అక్కడ్నించి రోప్ వే ద్వారా శ్రీశైలం ఆలయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆలయ వర్గాలు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికాయి. చంద్రబాబు ఇక్కడి భ్రమరాంబికా మల్లికార్జునస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు చంద్రబాబుకు వేదాశీర్వచనంతోపాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అధికారులు సీఎంకు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. ఈ పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు పంచెకట్టులో ప్రత్యేకంగా కనిపించారు.
Also Read : సూర్య ఫస్టు క్రష్ ఎవరో చెప్పిన కార్తి!
Admin
Studio18 News