Friday, 13 December 2024 09:13:11 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Andhra Pradesh: అప్పులు చేయాలంటే ఆంధ్రుల తర్వాతే.. కేంద్రం నివేదికలో షాకింగ్ విషయాలు

Date : 11 October 2024 12:57 PM Views : 28

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : అప్పులు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అగ్రస్థానంలో ఉన్నట్టు కేంద్రం తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలోని 18 ఏళ్లు దాటిన వారిలో ప్రతి లక్ష మందిలో సగటున 60,093 మంది అప్పులు చేస్తున్నట్టు కాంప్రిహెన్సివ్ యాన్యువల్ మాడ్యులర్ సర్వే పేర్కొంది. దీని ప్రకారం.. అప్పులు తీసుకునే విషయంలో పట్టణ ప్రజలతో పోలిస్తే గ్రామీణ ప్రజలు 4.3 శాతం ముందున్నారు. అలాగే, పట్టణ మహిళలతో పోలిస్తే గ్రామీణ మహిళల్లో అప్పులు ఉన్నవారు 32.86 శాతం, పురుషుల్లో 1.56 శాతం ఎక్కువ ఉన్నారు. అప్పులున్న పట్టణ మహిళలతో పోలిస్తే పురుషుల సంఖ్య 21.69 శాతం అధికం. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్య 7.49 శాతం అధికంగా ఉన్నట్టు నివేదిక పేర్కొంది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. దేశంలోని మరే రాష్ట్రంలోనూ పురుషులకు మించి మహిళలకు అప్పుల్లేవు. జులై 2022 నుంచి జూన్ 2023 మధ్య ఈ సర్వే నిర్వహించారు. దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ప్రతి లక్ష మందిలో 11,844 మందిపైనే అప్పులున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాదిలోనే ప్రజలపై రుణభారం ఎక్కువగా ఉన్నట్టు సర్వే వివరించింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు