Studio18 News - ANDHRA PRADESH / : మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి సంచలన విజయం వైపు దూసుకెళుతుండడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షాకు చంద్రబాబు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్ర ప్రజలు అపూర్వ విజయం కట్టబెడుతున్నారని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో మళ్లీ మహాయుతి ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని అన్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లకూ చంద్రబాబు ఫోన్ చేశారు. మహాయుతి కూటమికి అభినందనలు తెలిపారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి ప్రస్తుతం 224 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎంవీఏ కూటమి కేవలం 55 స్థానాల్లోనే ముందంజలో ఉంది.
Also Read : నాగచైతన్య కెరీర్‌లో యాడ్ అవుతున్న మరో కొత్త జానర్ సినిమా!
Admin
Studio18 News