Wednesday, 25 June 2025 07:45:16 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

ఒక్కొక్క కార్యాలయానికి రూ.10 లక్షలు ఇస్తాం: సీఎం చంద్రబాబు

Date : 09 June 2025 08:22 PM Views : 54

Studio18 News - ANDHRA PRADESH / : స్వర్ణాంధ్ర-2047' లక్ష్య సాధన దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ముందడుగు వేశారు. రాష్ట్రంలోని 26 జిల్లాలు, 175 నియోజకవర్గ కేంద్రాల్లో 'విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్' కార్యాలయాలను సోమవారం సచివాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ యూనిట్లు స్వర్ణాంధ్ర విజన్ అమలుకు పటిష్టమైన పునాది వేస్తాయని, శాసనసభ్యులకు ప్రభుత్వపరంగా ప్రత్యేక కార్యాలయాల లోటును తీరుస్తాయని సీఎం పేర్కొన్నారు. యూనిట్ల నిర్మాణం - నిధులు ప్రతి నియోజకవర్గ విజన్ యాక్షన్ యూనిట్ నిర్వహణకు రూ.10 లక్షలు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఎమ్మెల్యే అధ్యక్షతన, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ కార్యనిర్వహణ ఉపాధ్యక్షులుగా ఈ యూనిట్లు పనిచేస్తాయి. జిల్లా నోడల్ ఆఫీసర్, ఒక విద్యావేత్త, ఒక యువ ప్రొఫెషనల్, గ్రామ/వార్డు సచివాలయాలకు చెందిన ఐదుగురు విజన్ స్టాఫ్ కలిపి మొత్తం తొమ్మిది మంది సభ్యులుంటారు. నియోజకవర్గ కేంద్రానికి చెందిన ఎంపీడీవో కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రజలను భాగస్వాములను చేయాలని ప్రజాప్రతినిధులకు సీఎం పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర లక్ష్యాలు - జాతీయ దృక్పథం ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, రెండేళ్లలో మూడో స్థానానికి చేరుకుంటుందని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 'వికసిత్ భారత్-2047'కు అనుబంధంగా 'స్వర్ణాంధ్ర-2047' విజన్‌ను రూపొందించామని తెలిపారు. పేదరిక నిర్మూలన, యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, నీటి భద్రత వంటి పది సూత్రాలతో కార్యాచరణ ఉంటుందన్నారు. ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం గల భారతీయుల్లో 30% తెలుగువారేనని, ఈ ప్రగతిని కొనసాగించాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ హామీలు ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని, 'తల్లికి వందనం' ఈ నెలలోనే ప్రారంభించి, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు. దీపం పథకం లబ్ధిదారులకు నేరుగా నగదు జమ చేస్తామన్నారు. పోలవరం 2027 నాటికి, అమరావతి 2028కి, భోగాపురం విమానాశ్రయం 2026 నాటికి పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. విశాఖ, విజయవాడల్లో మెట్రో రైళ్లు, విశాఖ రైల్వే జోన్, పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలు వేగవంతం చేస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా, కేంద్ర సహకారంతో అభివృద్ధి, సంక్షేమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు 10 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించగా సీఎం అభినందించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :