Thursday, 12 March 2026 12:43:17 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

పులివెందులలో టీడీపీ ఫ్లెక్సీల ధ్వంసం.. ఎంపీ పీఏ సహా 15 మంది వైసీపీ నేతలపై కేసు

Date : 30 May 2025 02:49 PM Views : 192

Studio18 News - ANDHRA PRADESH / : మహానాడు సందర్భంగా కడప జిల్లా పులివెందులలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన ఘటనలో 15 మంది వైసీపీ నేతలపై కేసు నమోదైంది. నిందితుల జాబితాలో కడప వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) రాఘవరెడ్డిని ప్రధాన నిందితుడిగా (ఏ1) చేర్చగా, పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్‌ను ఐదో నిందితుడిగా (ఏ5) పేర్కొన్నారు. మహానాడు నేపథ్యంలో పులివెందులలోనూ టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, ఈ ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించివేసి, ధ్వంసం చేశారు. ఈ ఘటనపై టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణ అనంతరం ఈ ఘటనలో వైసీపీకి చెందిన పలువురు స్థానిక నాయకుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు మొత్తం 15 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా, ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి, పులివెందుల మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్ వంటి కీలక నేతల పేర్లు నిందితుల జాబితాలో ఉన్నాయి. ఈ ఘటనతో పులివెందులలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :