Studio18 News - ANDHRA PRADESH / : ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఎక్స్ వేదికగా మరో పోస్ట్ చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అపవిత్రం కావడంపై పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు ప్రకాశ్ రాజ్ ఎక్స్ వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా, ఎక్స్ వేదికగా మరో పోస్ట్ పెట్టారు. "గెలిచేముందు ఒక అవతారం... గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఎందుకు మనకీ అయోమయం… ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్?" అని ఎక్స్ వేదికగా తెలుగులో పోస్ట్ చేశారు. నిన్న చేయని తప్పుకు సారీ చెప్పించుకోవడంలో ఆనందం ఏమిటో అంటూ నటుడు కార్తీ సంఘటనను పరోక్షంగా ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. అయితే ఆయన ఈ వ్యాఖ్యలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి చేస్తున్నారని తెలిసిందే. కానీ నిన్న, నేడు మాత్రం నేరుగా పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావించలేదు.
Admin
Studio18 News