Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉండవల్లిలో సీఎం చంద్రబాబును కలిశారు. ఈ భేటీలో... కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా అంశంపై సీఎంతో చర్చించనున్నారు. ఇటీవల తాను ఢిల్లీలో పర్యటించిన తాలూకు వివరాలను సీఎంతో పంచుకోనున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ ఉప ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. సోషల్ మీడియా పోస్టులపై కేసులు, నామినేటెడ్ పదవుల కేటాయింపు అంశంపైనా పవన్ కల్యాణ్... చంద్రబాబుతో చర్చించే అవకాశముంది. కొన్నిరోజుల కిందట కాకినాడ పోర్టులో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన పవన్ కల్యాణ్... తనకు అధికారులు సహకరించడంలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో, నేడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : అక్రమ బియ్యం పట్టుకునేందుకు బోట్లు వేసుకుని సముద్రంలో హడావిడి చేయడం కాదు... నిజాలు వెలికితీయాలి: షర్మిల
Admin
Studio18 News