Studio18 News - ANDHRA PRADESH / : అమరావతి రైల్వే కనెక్టివిటీ ప్రాజెక్టుకు కేంద్ర క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. ఏపీ రాజధాని అమరావతి నగరాన్ని హైదరాబాద్, కోల్ కతా, చెన్నై నగరాలకు అనుసంధానం చేసేలా రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. రూ.2,245 కోట్ల వ్యయంతో 57 కిలోమీటర్ల మేర నూతన రైల్వే లైన్ నిర్మించనున్నారు. ఈ క్రమంలో కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల మేర భారీ వంతెనను కూడా నిర్మించనున్నారు. ఈ రైల్వే లైన్ తో అమరావతికి దక్షిణ, మధ్య, ఉత్తర భారతదేశంతో అనుసంధానం ఏర్పడుతుంది. ఈ రైల్వే ప్రాజెక్టుకు మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులను కూడా అనుసంధానించనున్నారు.
Admin
Studio18 News