Monday, 17 February 2025 05:06:56 PM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

Tenali: సహాన కుటుంబానికి రూ.10 లక్షల చెక్కు అందజేసిన మంత్రి నాదెండ్ల మనోహర్

Date : 24 October 2024 02:00 PM Views : 84

Studio18 News - ANDHRA PRADESH / : గుంటూరు జిల్లా తెనాలిలో ఇటీవల రౌడీ షీటర్ దాడిలో గాయపడిన సహాన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఘటనపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని పేర్కొనడంతో పాటు బాధిత కుటుంబానికి పది లక్షల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించారు. ఈ క్రమంలో సహాన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ.10 లక్షల చెక్కును పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం రాత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. రౌడీ షీటర్ల ఆగడాలను అదుపు చేస్తామని పేర్కొన్నారు. ఈ ఘటనలో పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని చెప్పారు. ప్రతి విషయాన్ని వైసీపీ రాజకీయ లబ్ది కోసం వినియోగించుకోవడం సిగ్గుచేటని మంత్రి విమర్శించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, తమ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, ఇల్లు మంజూరు చేయాలని ఈ సందర్భంగా హతురాలి తల్లి మంత్రిని కోరారు. కాగా, నిన్ననే వైసీపీ అధినేత వైఎస్ జగన్ తెనాలితో పాటు బద్వేల్ ఘటనలోని బాధిత కుటుంబాలను పరామర్శించి, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇవ్వడంతో పాటు ప్రతి బాధిత కుటుంబానికి పది లక్షల చొప్పున ఆర్ధిక సహాయం చేస్తామని ప్రకటించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు