Wednesday, 04 March 2026 08:51:51 AM
# Ambati Rambabu: అంబటి రాంబాబుకు రెండో షాక్... మరో కేసులో రిమాండ్ విధించిన కోర్టు # Jeffrey Epstein: ఎప్‌స్టీన్ మరణ ప్రకటనను అతడు చనిపోవడానికి ముందే రూపొందించారా? # Revanth Reddy: బీజేపీకి లైఫ్ లైన్ అసదుద్దీన్ ఒవైసీయే.. ఆయనే వారికి దేవుడు: రేవంత్ రెడ్డి # Chandrababu: క్షేత్రస్థాయిలో పర్యటించండి... విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు: సీఎం చంద్రబాబు # Surekha Vani: అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలి: సురేఖ వాణి కూతురు సుప్రీత # Chandrababu: ఉత్పత్తులకు బ్రాండింగ్, నాణ్యతే ముఖ్యం: సీఎం చంద్రబాబు # Revanth Reddy: మోదీ కచ్చితంగా బడాబాయే.. టీన్యూస్ జర్నలిస్టు ముఖంలో కేసీఆర్‌ను చూడలేను కదా: రేవంత్ రెడ్డి # Punjab: క్లాస్‌రూంలో దారుణం.. క్లాస్‌మేట్‌ను కాల్చి చంపి.. తనూ కాల్చుకున్న విద్యార్థి # Ram Gopal Varma: పిల్లలకు సోషల్ మీడియా నిషేధించాలనే డిమాండ్ పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు # Vijay Deverakonda: విజయ్ దేవరకొండ పెళ్లిపై మీడియా ప్రశ్న... స్పందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ # EPFO: పీఎఫ్ డబ్బులు ఇక యూపీఐతోనే.. ఏప్రిల్ నుంచి కొత్త సేవలు! # Prakash Raj: 'స్పిరిట్' నుంచి తొలగించారన్న వార్తలపై ప్రకాశ్‌ రాజ్‌ స్ట్రాంగ్ కౌంటర్‌ # Telangana Municipal Elections: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి పోలింగ్ # Ali Khamenei: 37 ఏళ్ల సంప్రదాయాన్ని పక్కన పెట్టిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ # AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు

NTR Bharosa Pensions: ఏపీలో ముందస్తు పింఛన్ల పండగ.. శ్రీకాకుళంలో 9 మంది లబ్ధిదారులకు రూ.18 లక్షల బకాయిలు అందజేత

Date : 31 December 2025 07:07 PM Views : 187

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : నూతన సంవత్సరం సందర్భంగా ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా 63.12 లక్షల మందికి రూ.2,743 కోట్లు విడుదల శ్రీకాకుళం జిల్లాలో 9 మందికి రూ.18 లక్షల బకాయిలు అందజేసిన మంత్రి అచ్చెన్న పింఛనుదారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు ఏపీలో నూతన సంవత్సర కానుకగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఇవాళ‌ పండుగ వాతావరణంలో జరిగింది. సాధారణంగా ప్రతినెలా ఒకటో తేదీన జరిగే ఈ కార్యక్రమం.. రేపు (జనవరి 1వ తేదీ) సెలవు దినం కావడంతో ఒక రోజు ముందుగానే నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచే వాలంటీర్లు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి నగదు పంపిణీ చేయగా, మధ్యాహ్నం 12 గంటల సమయానికి రికార్డు స్థాయిలో 87 శాతం పంపిణీ పూర్తయింది. ఈ నెలలో మొత్తం 63.12 లక్షల మంది లబ్ధిదారుల కోసం ప్రభుత్వం రూ.2,743 కోట్లు విడుదల చేసింది. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా నందిగం మండలం దీనబంధుపురంలో గతంలో పింఛన్లు నిలిచిపోయిన 9 మందికి కోర్టు ఆదేశాల మేరకు బకాయిలతో సహా పింఛన్లను పునరుద్ధరించారు. నిలిపివేసిన రోజు నుంచి ఇప్పటివరకూ లెక్కించిన మొత్తం రూ.18 లక్షలను మంత్రి అచ్చెన్నాయుడు స్వయంగా ఆ 9 మంది లబ్ధిదారులకు అందజేయడం విశేషం. పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్న చంద్రబాబు మరోవైపు ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు పింఛన్ల కోసమే దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.50 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని ఎక్స్ వేదికగా వెల్లడించారు. పేదల జీవితాలకు ఆర్థిక భరోసా కల్పించే ఈ కార్యక్రమం తనకు ఎంతో సంతృప్తిని ఇస్తుందని, కొత్త ఏడాదిలో అందరికీ మంచి జరగాలని సీఎం ఆకాంక్షించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :