Tuesday, 31 March 2026 04:31:43 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Gudivada Amarnath: కాపులంటే చంద్రబాబుకు కక్ష: గుడివాడ అమర్నాథ్

Date : 06 February 2026 07:46 PM Views : 53

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : ముద్రగడను ఎన్నో రకాలుగా వేధించారన్న గుడివాడ అంబటిపై దాడి చేసి ఆయనపైనే కేసు పెట్టారని మండిపాటు నాగబాబు గతంలో నాస్తికుడినని చెప్పుకున్నారని విమర్శ కాపులంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కక్ష అని మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. కాపులను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందని అన్నారు. కాపులపై చంద్రబాబు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వంగవీటి రంగాను హత్య చేశారని, ముద్రగడను కూడా పలు రకాలుగా వేధించారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోందని అమర్నాథ్ అన్నారు. అంబటి రాంబాబు మీద దాడి చేసి ఆయనపైనే తప్పుడు కేసు పెట్టారని మండిపడ్డారు. అంబటి రాంబాబు కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు రేపు ఉదయం వెళుతున్నామని చెప్పారు. తమది సంఘీభావ యాత్ర మాత్రమేనని, రాజకీయ యాత్ర కాదని అన్నారు. అంబటి రాంబాబుపై తప్పుడు కేసు విషయంలో న్యాయపరంగా పోరాటం చేస్తామని చెప్పారు. తాను నాస్తికుడినని గతంలో చెప్పుకున్న జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఇప్పుడు సనాతన ధర్మం అని ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తిరుమల కల్తీ లడ్డూపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్టాండ్ ఎప్పటికప్పుడు మారిపోతోందని ఎద్దేవా చేశారు. తిరుమల లడ్డూకు వాడిన నెయ్యిలో జంతు కొవ్వు లేదని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నివేదిక వెల్లడించిందని... ఇప్పుడు మళ్లీ దీనిపై కమిటీ ఎందుకని ప్రశ్నించారు. లడ్డూలో జంతు కొవ్వు ఉందని చెప్పించడం కోసమే కమిటీ వేస్తున్నారా? అని నిలదీశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :