Sunday, 08 March 2026 09:53:35 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Nara Lokesh: నేడు మోదీ పుట్టినరోజు... లండన్ ఇస్కాన్ మందిరంలో నారా లోకేశ్ ప్రార్థనలు

Date : 17 September 2025 07:14 PM Views : 190

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : ప్రధాని మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు లండన్‌లోని ఇస్కాన్ ఆలయంలో ప్రార్థనలు చేసిన నారా లోకేశ్ మోదీ దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆకాంక్ష ఆయన నాయకత్వంలోనే వికసిత భారత్ సాధ్యమన్న లోకేశ్ దేశానికి మోదీ దార్శనిక నాయకత్వం అవసరమని వ్యాఖ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ లండన్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నేడు లండన్‌లోని ప్రఖ్యాత ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించి, ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆకాంక్షిస్తూ పూజలు చేశారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, దేశానికి ప్రధాని మోదీ దార్శనిక నాయకత్వం మరిన్ని ఏళ్లపాటు అందాలని ఆ భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. "మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి 75వ జన్మదినం సందర్భంగా లండన్ ఇస్కాన్ ఆలయంలో ప్రార్థనలతో ఈ రోజును ప్రారంభించాను. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, దేశానికి ఆయన నాయకత్వం కొనసాగాలని కోరుకున్నాను" అని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీ మార్గనిర్దేశంలో 'వికసిత భారత్' లక్ష్యాన్ని దేశం తప్పకుండా సాధిస్తుందని నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. మన గొప్ప దేశానికి ఆయన నాయకత్వం ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తన లండన్ పర్యటనలో ఉన్న నారా లోకేశ్, ప్రధాని పుట్టినరోజున ఈ విధంగా ప్రత్యేక ప్రార్థనలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :