Tuesday, 03 December 2024 04:45:32 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

పాడేరు శాసన సభ్యులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు డిమాండ్

Date : 23 November 2024 11:31 PM Views : 44

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : గురుకుల పాఠశాల కళాశాలల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు మరియు అధ్యాపకులు గా పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని అల్లూరి జిల్లా పాడేరు శాసన సభ్యులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అల్లూరి జిల్లా పాడేరులోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి గురుకుల పాఠశాల, కళాశాలల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు మరియు అధ్యాపకులుగా పనిచేస్తున్న ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత ఎనిమిది రోజులుగా స్థానిక ఐటీడీఏలో నిరాహారదీక్ష చేపట్టినప్పటికి కనీసం ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో తొమ్మిది గిరిజన గురుకుల పాఠశాలలు మరియు ఎనిమిది గిరిజన గురుకుల కళాశాలలు ఉండగా మొత్తం 4000 మంది విద్యార్థులు ఉన్నారని, గత వారం రోజులుగా ఉపాధ్యాయులు వారియొక్క డిమాండ్లను పరిష్కరించాలని రీలే నిరాహార దీక్షలు చేపట్టడం ద్వారా విద్యార్థులకు విధ్యబోధనలు లేకపోవడంతో చదువుకి దూరం అవుతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయుల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం చొరవతీసుకుని వారి యొక్క సమస్యలు పరిష్కరించి, విద్యార్థులకు సక్రమంగా విద్యను అందించే విధంగా చొరవ తీసుకోవాలని ప్రభుత్వన్ని కోరారు. అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు అందరిని కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా తీసుకుని వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

Also Read : నా కులం వాళ్లను నా సినిమా చూడమంటే... ఒక్కడు కూడా చూడడు: మోహన్ బాబు

WANTED REPORTERS తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రసారమవుతున్న STUDIO 18 NEWS చానల్ నందు పని చేయుటకుగాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో జిల్లాల వారిగా స్టాఫ్ రిపోర్టర్లు, నియోజకవర్గాల వారిగా రిపోర్టర్లు వెంటనే కావలెను. తెలుగులో చదవటం, మాట్లాడటం, రాయడం వచ్చి, మీ స్థానిక సమస్యలపై అవగాహనతో పాటు 20 సంవత్సరాల వయస్సు దాటిన స్త్రీ, పురుష అభ్యర్థులు రిపోర్టర్లుగా చేరుటకు అవకాశం కల్పించబడుతుంది. అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత కలదు. కొత్తగా మీడియా రంగంలోకి రావాలనుకునే వారికి సైతం అవకాశం. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలచే గుర్తింపు పొంది అక్రిడేషన్ సౌకర్యం కలిగిన సంస్థ. ISO 10002 : 2018 గుర్తింపు కలిగినది. అర్హులైన రిపోర్టర్లకు అక్రిడేషన్ కల్పించబడును. పూర్తి వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ : 7799975556.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు