Saturday, 07 March 2026 09:21:11 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

ఇది దైవ నిర్ణయంగా భావిస్తున్నాను: నందమూరి బాలకృష్ణ

Date : 30 May 2025 02:28 PM Views : 188

Studio18 News - ANDHRA PRADESH / : ప్రముఖ నటుడు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణకు మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయనను 'ఎన్టీఆర్ జాతీయ అవార్డు'కు ఎంపిక చేసింది. ఈ విషయాన్ని బాలకృష్ణ స్వయంగా ప్రకటిస్తూ, తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. పలు శుభ సందర్భాలు ఒకేసారి కలిసివచ్చిన ఈ తరుణంలో ఈ అవార్డు దక్కడం దైవ నిర్ణయంగా, తన తండ్రి నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, "ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు పూర్తిచేసుకున్న అద్భుతమైన ఘడియలు ఒకవైపు, ఎన్టీఆర్ నట ప్రస్థాన 75 సంవత్సరాల అమృతోత్సవాలు జరుగుతున్న శుభ ఘడియలు మరోవైపు, నటుడిగా నేను 50 ఏళ్ల స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్న శుభ సందర్భం ఇంకొక వైపు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మభూషణ్‌తో సత్కరించిన ఇలాంటి తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 'ఎన్టీఆర్ జాతీయ అవార్డు'ని నాకు ప్రకటించడం నా అదృష్టంగా, దైవ నిర్ణయంగా, నాన్నగారి ఆశీర్వాదంగా భావిస్తున్నాను" అని అన్నారు. ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన పురస్కారానికి తనను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, జ్యూరీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపకుంటున్నానని బాలకృష్ణ వెల్లడించారు. "ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగు ప్రజల దీవెనలు, నాన్నగారి చల్లని కృప, భగవంతుని ఆశీర్వాదాలు నాకు ఎల్లవేళలా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను" అని బాలకృష్ణ తన ప్రకటనలో పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ ఇటీవలే భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి తన తండ్రి పేరు మీదుగా ఏర్పాటు చేసిన 'ఎన్టీఆర్ జాతీయ అవార్డు'కు ఎంపిక కావడం ఆయన సినీ ప్రస్థానంలో మరో మైలురాయిగా నిలుస్తుంది. ఈ వార్తతో నందమూరి అభిమానులు, తెలుగు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :