Thursday, 12 March 2026 04:18:44 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

"నువ్వు మగాడ్రా బుజ్జి" అని నారా లోకేశ్ తో చెప్పమన్నాడు: మంత్రి టీజీ భరత్

Date : 27 May 2025 06:57 PM Views : 204

Studio18 News - ANDHRA PRADESH / : తెలుగుదేశం పార్టీ కడపలో నిర్వహిస్తున్న మహానాడు వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తన ప్రసంగంలో... పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పట్ల తనకున్న అభిమానాన్ని, ప్రశంసలను వ్యక్తం చేశారు. లోకేశ్ చూపిన పట్టుదల, ప్రజా సమస్యలపై ఆయనకున్న అవగాహనను మంత్రి కొనియాడారు. "నారా లోకేశ్ గారు యువగళం పాదయాత్ర చేసేటప్పుడు, కొందరు వారం తర్వాత పాదయాత్ర ఉండదు అన్నారు... కానీ లోకేశ్ గారు ఎంతో పట్టుదలతో దాదాపు 3 వేల కి.మీ. పైగా పాదయాత్ర చేశారు. జనాలతో మమేకమై ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. వారి బాధలను చూశారు. వారి కన్నీళ్లు చూశారు. అధికారంలోకి వచ్చాక వారికి అండగా ఉన్నారు. నారా లోకేశ్ కు ఓ మాట చెప్పమని నా స్నేహితుడు అన్నాడు. “నువ్వు మగాడ్రా బుజ్జి” అని చెప్పమన్నాడు" అని టీజీ భరత్ వెల్లడించారు. దాంతో మహానాడు ప్రాంగణం చప్పట్లతో, నినాదాలతో మార్మోగింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :