Studio18 News - ANDHRA PRADESH / Tirupati : తిరుపతి (Tirupati) శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavam) భాగంగా సోమవారం రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రథోత్సవం కర్ణాల వీధి, బేరి వీధి, గాంధీరోడ్డు మీదుగా తిరిగి ఆలయ రథమండపానికి చేరుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ రథాన్ని లాగారు. భక్తులు అడుగడుగునా టెంకాయలు కొట్టి స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు.శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి, నమ్మాళ్వార్ల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. రథోత్సవంలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, ఎఫ్ఏ అండ్ సీఏవో బాలాజి, ఎస్ ఇ-2 జగదీశ్వర్‌రెడ్డి, డిప్యూటీ ఈవో శాంతి, ఇతర ఇంజినీరింగ్ పలుశాఖల అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Admin
Studio18 News