Studio18 News - ANDHRA PRADESH / : మహారాష్ట్ర కొత్త సీఎంగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారోత్సవానికి హజరయ్యేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు బయలుదేరి వెళుతున్నారు. ముంబయిలోని అజాద్ గ్రౌండ్‌లో మహా ముఖ్యమంత్రిగా మూడోసారి ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీఏ నేతలు హజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి హజరయ్యేందుకు సీఎం చంద్రబాబు ఈ రోజు మధ్యాహ్నం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ముంబయి చేరుకోనున్నారు. ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత చంద్రబాబు ముంబయి నుంచి విమానంలో నేరుగా విశాఖపట్నానికి చేరుకుంటారు. రాత్రి విశాఖలో బస చేయనున్నారు. విశాఖలో రేపు జరగనున్న డీప్ టెక్నాలజీ సమ్మిట్ 2024కు ఆయన హజరుకానున్నారు. ఈ సదస్సు తర్వాత విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అధారిటీ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు.
Also Read : మూడు వేరియంట్లలో ‘విడా వీ2‘.. మెరుగైన ఫీచర్లతో టీవీఎస్, బజాజ్ చేతక్‌కు గట్టి పోటీ!
Admin
Studio18 News