Thursday, 12 March 2026 12:10:01 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ

Date : 07 February 2026 06:51 PM Views : 119

Studio18 News - ANDHRA PRADESH / Tirupati : తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందన్న శ్రీనివాసవర్మ కల్తీ జరిగిందని వైవీ, భూమన, చెవిరెడ్డి ఇప్పుకున్నారని వ్యాఖ్య స్వామివారికి హారతి ఇచ్చే నెయ్యిని కల్తీ చేశారని మండిపాటు తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీడీబీ నివేదిక ప్రకారం నిబంధనల ఉల్లంఘన జరిగిందని చెప్పారు. లడ్డూల తయారీకి ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని అన్నారు. కానీ, ఈ వ్యవహారంలో వైసీపీ నేతల వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించారు. కల్తీ నెయ్యి విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముగ్గురూ కల్తీ జరిగిందని ఒప్పుకున్నారని శ్రీనివాసవర్మ అన్నారు. కల్తీ జరిగిందని వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ అని ప్రశ్నించారు. బోలేబాబాకు పాల ఉత్పత్తి, డెయిరీ లేకపోయినా నెయ్యి తయారు చేశారని వివరించారు. టెండర్ల నిబంధనల్లో పెద్ద ఎత్తున మార్పులు చేశారని... అవినీతి కోసం అలా చేశారని అన్నారు. ఆ నెయ్యితోనే స్వామివారికి హారతి ఇస్తామని... అలాంటి నెయ్యిని కల్తీ చేశారని మండిపడ్డారు. అర్హత లేని వారికి నెయ్యి కాంట్రాక్టు ఎలా ఇస్తారని ప్రశ్నించారుశ.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :