Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన, ఢిల్లీలోని ప్రముఖ బుక్ స్టోర్స్ ను సందర్శించారు. కన్నాట్ ప్లేస్ లో ఉన్న ఆక్స్ ఫర్డ్ బుక్ స్టోర్, ఖాన్ మార్కెట్ లో ఉన్న ఫకీర్ చంద్ బుక్ స్టోర్ ను సందర్శించారు. పవన్ కల్యాణ్ కు పుస్తక పఠనం అత్యంత ఇష్టం అని తెలిసిందే. చరిత్ర, సాహిత్యం, ప్రపంచ సామాజిక స్థితిగతుల గురించి ఆయన ఎన్నో పుస్తకాలు చదివారు. ఆ ఆసక్తి కొద్దీ... నేడు ఢిల్లీలోని రెండు బుక్ స్టోర్లలో కొత్త పుస్తకాలను పరిశీలించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.
Also Read : రిషికేశ్ లో తపస్సు చేసుకుంటా.. నా సెక్యూరిటీని వెనక్కి తీసుకోండి: స్వరూపానందేంద్ర స్వామి
Admin
Studio18 News