Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : కొత్త వైన్ షాపుల టెండర్ల ద్వారా ఏపీ ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరింది. వైన్ షాపుల కోసం రాజకీయ నాయకులతో పాటు, వ్యాపారులు, సామాన్యులు కూడా పోటీ పడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఢిల్లీకి చెందిన ఓ లిక్కర్ వ్యాపారి కూడా రంగంలోకి దిగారు. సిండికేట్లుగా దరఖాస్తు చేసిన వారు కూడా ఆశ్చర్యపోయేలా ఆయన ఏకంగా 155 మద్యం షాపులకు దరఖాస్తు చేశారు. ఆయన పూర్తిగా విశాఖ జిల్లాలో మద్యం వ్యాపారంపై ఫోకస్ చేశారు. నందినీ గోయల్, సారికా గోయల్, అమిత్ అగర్వాల్, సౌరభ్ గోయల్ పేర్లతో దరఖాస్తులు సమర్పించారు. ఈ షాపుల దరఖాస్తు కోసం ఆయన ఏకంగా రూ. 3.10 కోట్లు చెల్లించారు. చివరకు ఆయనకు లాటరీలో 6 షాపులు దక్కాయి. ఒడిశా నుంచి కూడా ఓ లిక్కర్ వ్యాపారి భారీగా దరఖాస్తులు సమర్పించారు. ఆయనకు 2 షాపులు దక్కాయి.
Admin
Studio18 News