Sunday, 25 January 2026 05:47:17 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

థియేటర్ల బంద్ వెనుక శక్తులపై విచారణకు ఆదేశించిన పవన్ కల్యాణ్

Date : 27 May 2025 04:48 PM Views : 201

Studio18 News - ANDHRA PRADESH / : ఆంధ్రప్రదేశ్‌లో సినిమా హాళ్ల నిర్వహణను పటిష్టంగా చేపట్టి, ప్రేక్షకులకు నాణ్యమైన సేవలు అందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. పవన్ తో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ సమావేశమయ్యారు. సినిమా హాళ్ల బంద్ ప్రకటన, ఆ తర్వాత శాఖాపరంగా తీసుకున్న చర్యల గురించి పవన్ కు దుర్గేశ్ వివరించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పలు కీలక సూచనలు చేశారు. కొత్త సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరల పెంపు కోసం నిర్మాతలు వ్యక్తిగతంగా కాకుండా, తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (ఫిల్మ్ ఛాంబర్) ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించేలా పటిష్టమైన విధానాన్ని అమలు చేయాలని పవన్ స్పష్టం చేశారు. త్వరలో విడుదల కానున్న తన చిత్రం 'హరిహర వీరమల్లు'కు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని, నిర్మాత నేరుగా కాకుండా ఫిల్మ్ ఛాంబర్ ద్వారానే ధరల పెంపు ప్రతిపాదనలు పంపాలని తేల్చిచెప్పారు. టికెట్ ధరలు, సినిమా హాళ్ల నిర్వహణ వంటి ఏ విషయంలోనైనా ప్రభుత్వ శాఖలు తమ విధులను కచ్చితంగా నిర్వర్తించాలని సూచించారు. సినిమా హాళ్లలో టికెట్ ధరలతో పాటు తినుబండారాలు, శీతల పానీయాలు, చివరికి వాటర్ బాటిల్ ధరలు కూడా అధికంగా ఉండటంపై సమావేశంలో చర్చ జరిగింది. వీటి వాస్తవ ధరలు, విక్రయ ధరలు, నాణ్యతా ప్రమాణాలపై సంబంధిత శాఖల అధికారులు నిరంతర పర్యవేక్షణ జరిపి, ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పవన్ ఆదేశించారు. మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్లలో ఆహార పదార్థాల వ్యాపారంలో గుత్తాధిపత్యం నడుస్తోందన్న విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చిందని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని మంత్రి దుర్గేశ్ కు సూచించారు. తినుబండారాల ధరలు అందుబాటులో ఉంటేనే ప్రేక్షకులు కుటుంబాలతో సినిమాకు వస్తారని, తద్వారా ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం కూడా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై పన్నుల శాఖతో సమీక్షించాలని తెలిపారు. సినిమా హాళ్ల బంద్ ప్రకటన వెనుక ఉన్న కారణాలు, కొందరు వ్యక్తుల ప్రమేయం, ఇద్దరు నిర్మాతలు తమకు సంబంధం లేదని ప్రకటించడం, తూర్పు గోదావరి జిల్లా నుంచే బంద్ ప్రకటన రావడం వంటి అంశాలపై చర్చించారు. బంద్ వెనుక ఒక నిర్మాత, థియేటర్లు కలిగిన రాజకీయ నాయకుడి ప్రమేయం ఉందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయాలని పవన్ సూచించారు. "ఈ బంద్ ప్రకటన వెనుక ఎవరున్నా, వారు జనసేన పార్టీకి చెందినవారైనా సరే, కఠిన చర్యలు తీసుకోవాలి. బెదిరింపులతో వ్యాపారాలు చేసే అనారోగ్యకర వాతావరణాన్ని సహించవద్దు" అని స్పష్టం చేశారు. సినిమా వ్యాపారం సజావుగా సాగేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి, ఇతర సినీ సంఘాలకు తెలియజేయాలని ఆదేశించారు. అలాగే, ప్రభుత్వం తీసుకురానున్న సమగ్ర సినిమా అభివృద్ధి పాలసీ కోసం సినీ పరిశ్రమలోని అన్ని వర్గాల నుంచి

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :