Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) సంచలనం సృష్టించిన లేడీ అఘోరీ (Lady Aghori) ఆలయాల పర్యటన కొనసాగుతున్నది. మొన్నటికి మొన్న మహానంది, యాగంటి, కోటప్ప కొండ క్షేత్రాలను దర్శించుకున్న ఆమె తాజాగా భీమవరంలో శ్రీ సోమేశ్వర స్వామిని, పాలకొల్లులో శ్రీ క్షీర రామలింగేశ్వరస్వామి ఆలయాల్లో పర్యటించారు. లోక కళ్యాణం చేయడానికి మాత్రమే తాను వచ్చానని ఆమె పేర్కొన్నారు. ఎంత మంది ఎన్ని విమర్శించినా తన పోరాటం ఆగదని తేల్చిచెప్పారు. సనాతన ధర్మం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని వెల్లడించారు. ఆడపిల్లలను కాపాడుకోవాల్సిన అవసరం సమాజంపై ఉందన్నారు.
Also Read : గర్భగుడి ముందే పూజారుల ఫైటింగ్.. ఏపీలోని ఆలయంలో ఘటన..
Admin
Studio18 News