Thursday, 12 December 2024 02:14:03 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Kodali Nani: పాపం కొడాలి నాని.. జగన్ పక్కన పెట్టేశారా?

Date : 18 October 2024 12:26 PM Views : 23

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇన్నాళ్లూ బలమైన నాయకుడిగా, జగన్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగిన మాజీమంత్రి కొడాలి నాని పరిస్థితి ఇప్పుడు ఏంటన్న చర్చ జోరుగా సాగుతోంది. పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రతిపక్షాలపై నోరేసుకుని పడిపోయే నాని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, లోకేశ్‌, పవన్ కల్యాణ్‌పై సహా విపక్ష నేతలపై చేసిన జుగుప్సాకర వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. అలాంటి నానిపై వైసీపీలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాని ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి గొప్ప మద్దతుదారుగా ఉండేవారు. జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడు కూడా. నాని వైసీపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత జగన్ ఆయనను టీడీపీపై ప్రయోగించారు. నాని నాలుగు ఎన్నికల్లో విజయం సాధించారు. 2004లో టీడీపీ తరపున అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. ఆ తర్వాత వైసీపీ పంచన చేశారు. దీంతో ఆయనను ఓడించేందుకు 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తీవ్ర ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. జగన్ ఆయనను టీడీపీపై ప్రయోగించడం, ఆ పార్టీ నేతలపై నోరు పారేసుకోవడంతో సొంత సామాజికవర్గంలోనే ఆయనపై వ్యతిరేకత పెల్లుబికింది. నానిని గుడివాడలో ఓడించేందుకు టీడీపీ చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఫలించాయి. 53,040 ఓట్ల భారీ మెజార్టీతో అక్కడ టీడీపీ అభ్యర్థి గెలుపొందడంతో నాని విజయ యాత్రకు చెక్ పడింది. కాగా, ఇటీవల జగన్ కొత్తగా ప్రకటించిన పార్టీ ప్రాంతీయ కోఆర్డినేటర్ల జాబితాలో ఆయనకు అత్యంత నమ్మకస్తుడైన కొడాలి నాని పేరు కనిపించలేదు. ఆరుగురు కోఆర్డినేటర్లను జగన్ నియమిస్తే వారిలో ఐదుగురు జగన్ సామాజిక వర్గంవారే ఉన్నారు. వీరు కాకుండా సీనియర్ నేత బొత్సకు మాత్రమే జగన్ చోటిచ్చారు. ఈ నియామకాలతో జగన్ మరోమారు తమది రెడ్డి పార్టీని స్పష్టంగా చెప్పినట్టు అయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మిగతా సామాజిక వర్గాలను ఆయన పల్లకీ మోసే బోయలుగానే చూస్తున్నారని విమర్శిస్తున్నారు. 2019లో వైసీపీ విజయం సాధించిన తర్వాత నానికి జగన్ క్యాబినెట్‌లో చోటు లభించింది. అయితే, 2022లో ఆయనను క్యాబినెట్ నుంచి తప్పించారు. ఆ తర్వాత ఆయనను గుంటూరు, పల్నాడు కోఆర్డినేటర్‌గా జగన్ నియమించారు. ఎన్నికలకు ముందు ఆయనను ఆ పదవి నుంచి కూడా తప్పించి ఆయన సేవలను ఎన్నికల్లో ఉపయోగించుకున్నారు. ఓటమి తర్వాత ఆయన వైసీపీలో ఆయన పేరే వినిపించడం మానేసింది. నాని దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు. తన సామాజిక వర్గం వారు పట్టించుకోక, అటూ జగన్ కూడా దగ్గరికి తీసుకోకపోవడంతో ఆయన పరిస్థితి ‘రెంటికీ చెడ్డ రేవడి’లా తయారైందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు